దేశంలో భక్తి, విశ్వాసాలు ప్రజల మనసులో బలంగా ఉన్నాయి. దీనికి ఉదాహరణగా హిమాచల్‌ప్రదేశ్ మండీలోయలోని కమ్రునాగ్ సరస్సు నిలుస్తోంది. ఇక్కడ ఉండే ప్రసిద్ధ దేవాలయానికి వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత సమీపంలోని సరస్సులో వజ్రాభరణాలు, బంగారం, వెండి వేస్తారు. ఆ నిధి దేవతలకు చెందినదని, ఓ భారీ పాము కాపలా ఉంటుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వాటిని తీసుకోవాలని దొంగలు కూడా అనుకోరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa