మూడేళ్లు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని. దంగేరు సెక్టార్ పర్యవేక్షకురాలు ఎన్. పుణ్యవతి అన్నారు. కె. గంగవరం మండలం కోటిపల్లిలో స్థానిక కేంద్రాల పరిధిలోని కార్యకర్తలు, పిల్లలంతా కలిసి ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు ఆంగ్లమాధ్యమ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో బోధన ఉంటోందని నినాదాలు చేశారు. ప్రభుత్వం అందించిన ఆటల సామగ్రి, బోధన పరికరాలు, ఆంగ్లమాధ్యమ బొమ్మల పుస్తకాలను ప్రదర్శనగా ఊరేగించారు. కార్యక్రమంలో కార్యకర్తలు జి. శ్రీదేవి, కె. నాగమణి, బి. వెంకటలక్ష్మి, డి. వెంకటలక్ష్మి, డి. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.