పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద సాగునీటిని నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు శుక్రవారం విడుదల చేశారు. ముందుగా ప్రత్యేకపూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పెండ్యాల కాలువ ద్వారా నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలోని 6, 300 ఎకరాలకు సాగనీటిని అందిస్తారు. అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.