కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ అధికమవుతున్న తీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుదుచ్చేరిలోని 23 నియోజకవర్గాల్లో 13 కొవిడ్ కేసులు ఉండగా, కారైకాల్, మాహేలలో ఏమీలేవు. యానాంలో మాత్రం 16 కేసులున్నాయి. 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం వీడి ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని ఆరోగ్యశాఖ డీడీ రవిశంకర్ కోరారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం చేయాలన్నారు.