ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు చేయనుంది. దీనిపై శుక్రవారమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు టీఏ, ఇతర అలవెన్సులకు సంబంధించి మరో జీవో విడుదల చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టినప్పుడు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ తాజాగా అమలైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.