తమిళనాడులోని పెరంబూర్ సమీపంలో మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజ్‌కు ఏంజెల్ (12) అనే కుమార్తె ఉంది. ఆ బాలిక ఏడవ తరగతి చదువుతోంది. ఇటీవల కాలంలో ఆ బాలిక ఎక్కువగా టీవీ చూస్తోంది. టీవీకి అతుక్కుపోవద్దని బాలికను తల్లి మందలించింది. దీనికి నొచ్చుకున్న ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శుక్రవారం ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa