జమ్మూకశ్మీర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఈ సందర్భంగా ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa