ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్క్ డ్ ఆధార్ కార్డు కూడా ఉందన్నది ఎంతమందికి తెలుసు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 03:01 PM

ఆధార్ అంటే  అందరికీ తెలిసిందే...కానీ మాస్క్ డ్ ఆధార్ కార్డు కూడా ఉందని ఎవరికి తెలుసు..? అసలు ఈ కార్డ్ లో ఏమిటీ ప్రత్యేకత అంటారా...? మన దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్. ప్రభుత్వ పథకాలతో పాటు చాలా సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రతీచోట ఇలా ఆధార్ కార్డు ఫొటో కాపీ ఇవ్వడం వల్ల వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల స్కామ్‌లు కూడా జరగవచ్చు. అందుకే ఈనెల 27న కేంద్ర ప్రభుత్వం ఓ మార్గదర్శకాన్ని వెల్లడించింది. ఆధార్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు కేవలం మాస్క్‌డ్ ఆధార్ కార్డుల ఫొటో కాపీలనే సంస్థలకు ఇవ్వాలని ప్రజలకు సూచించింది. అయితే వెంటనే ఆ సూచనను ఉపసంహరించుకుంది. మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించకున్నా ఆధార్ నంబర్‌ను జాగ్రత్తగా అవసరం మేరకు మాత్రమే షేర్ చేయాలని చెప్పింది. అయితే అసలు మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది..? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడండి.


మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి..?


డౌన్‌లోడ్ చేసుకునే ఈ-ఆధార్‌లో నంబర్లు అన్నీ కనిపించకుండా చేసుకోవడమే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగమని యూఐడిఏఐపేర్కొంటోంది. ఆధార్ నంబర్లు 12 ఉంటాయి. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోని తొలి ఎనిమిది నంబర్లు XXXX-XXXX అని మాస్క్ అయి కనిపిస్తాయి. చివరి నాలుగు నంబర్లు మాత్రం కనిపిస్తాయి. ఉదాహరణకు ఒకవేళ మీ ఆధార్ నంబర్ 1234 5678 9101 అయితే మాస్క్‌డ్ ఆధార్‌లో XXXX XXXX 9101గా కనిపిస్తుందన్న మాట. యూజర్ ఐడెంటిటీ సెక్యూరిటీ కోసం ఆ డాక్యుమెంట్‌లో తొలి ఎనిమిది నంబర్లు కనిపించవు.


మాస్క్‌డ్ ఆధార్ ఎక్కడ ఉపయోగించవచ్చు?


ఆధార్ నంబర్‌ తప్పకుండా సమర్పించాల్సిన అవసరం లేని.. కేవలం ఈ-కేవైసీ మాత్రం ఇవ్వాల్సిన సందర్భాల్లో మాస్క్‌డ్ ఆధార్‌ కార్డును ఉపయోగించవచ్చు. మీ ఆధార్ నంబర్‌లోని చివరి 4 డిజిట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. కేవైసీ అవసరాల కోసం ఈ-ఆధార్, మాస్క్‌డ్ ఆధార్‌ కాపీల్లో దేన్నయినా సమర్పించవచ్చు.


మాస్క్‌డ్ ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..


ముందుగా బ్రౌజర్‌లో https://eaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.


కిందికి స్క్రోల్ చేస్తే డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.


అనంతరం 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.


ఆ తర్వాత అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.


కింద మీకు మాస్క్‌డ్ ఆధార్ కావాలా (Do you Want Masked Aadhaar Card) అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే టిక్ పడుతుంది.


ఆ తర్వాత కింద ఓటీపీ ఎంటర్ చేసి.. వెరిఫై&డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. ఈ మాస్క్‌డ్ ఈ-ఆధార్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.


పాస్‌వర్డ్ ఇదే..


ఆధార్ పీడీఎఫ్ డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులో మొదటి నాలుగు ఆక్షరాలు, మీ డేట్ ఆఫ్ బర్త్‌లోని సంవత్సరం దీనికి పాస్‌వర్డ్. మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి.. ఆ తర్వాత పుట్టిన సంవత్సరాన్ని సంఖ్యల రూపంలో టైప్ చేసి ఎంటర్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.


ఉదాహరణకు పేరు RAMARAJU, పుట్టిన తేదీ - 11-01-1990 ఉంటే.. ఆ ఈ-ఆధార్ పీడీఎఫ్ డాక్యుమెంట్ పాస్‌వర్డ్ RAMA1990 గా ఉంటుంది.


ఇదిలావుంటే పై పద్ధతిలోనే ఈ-ఆధార్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మాస్క్‌డ్ ఆధార్ కార్డు వద్దనుకుంటే మొత్తం ప్రక్రియలో.. మాస్క్‌డ్ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa