పబ్ జీ ఆడొద్దన్నందుకు ఓ బాలుడు తన తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో చోటుచేసుకుంది. సాధన అనే మహిళకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. తన భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. పబ్ జీ ఆడొద్దని సాధన ఎన్నిసార్లు చెప్పినా బాలుడు వినిపించుకోకపోవడమే కాకుండా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. 3 రోజులు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచడంతో పోలీసులకు తెలిసింది. బాలుడిని అరెస్ట్ చేశారు.