కృష్ణా జిల్లా: గుడివాడకు చెందిన నాయుడు గోవర్ధన్(22) ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణంలో గుడివాడ వెళ్తుండగా కోమటిగుంట వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోవర్ధన్ ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు తండ్రి నాయుడు మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.