గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. మన జగనన్నలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడని అన్నారు. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శింగనమల నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగిపోతోంది. ఎమ్మెల్యే వెంట అధికారులు కూడా ఉండటంతో సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే వారితో మాట్లాడుతూ, ఒక బుక్ లో నోట్ చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్న వైనాన్ని తెలుసుకుంటున్నారు.ఇలా ఎమ్మెల్యే తనదైన శైలిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందుకు సాగిపోతున్నారు.