చిలకలూరిపేట మండలం లో తాగునీటి పథకాల ఏర్పాటు, మరమ్మతులకు జల్ జీవన్ మిషన్ ద్వారా రూ4. 1కోట్లుమంజూరయ్యాయి. యడ్లవల్లి, కట్టుబడివారి పాలెం, మద్దిరాల, కమ్మవారిపాలెం, బొప్పూడి, మిట్టపాలెం, గంగన్న పాలెం, మురికిపూడి, తాతపూడి, కావూరు, లింగంగుంట్ల, పోతవరం, వేలూరు గ్రామాలలో తాగునీటి పథకాలు మరమ్మతులు, కొళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.