సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న రెండు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు బాపట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్లలో మోటార్ వెహికల్ చెకింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంవిఐ మాట్లాడుతూ సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, మద్యం సేవించి వాహనం నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.