పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ అన్నారు. మలేరియా వ్యతిరేక మహోత్సవాల సందర్భంగా బ్రహ్మంగారిమఠంలోని పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫళనిరాజు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa