అమలాపురంలో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటన విషయంలో ప్రభుత్వం, పోలీసులు వహిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.