2022 -23 ఆర్థిక సంవత్సరానికి గాను చిలకలూరిపేట మున్సిపాలిటీకి చెల్లించవలసిన ఆస్తిపన్ను మొత్తమును ఈనెల 30వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీ మినహాయింపు ఉంటుందని కమిషనర్ గోవిందరావు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు దగ్గరలోని వార్డు సచివాలయము, మున్సిపల్ ఆఫీస్ నందు గాని ఆన్లైన్ ద్వారా గాని ఈ నెల 30వ తేదీలోగా చెల్లించి తగు రశీదు పొందాలని కోరారు. పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.