పాము కాటు కంటే దోమకాటు ప్రమాదమని దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోటప్పకొండ ప్రాథమిక వైద్యశాల హెల్త్ సూపర్వైజర్ కరిముల్లా అన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ పి హెచ్ సి పరిధిలోగల గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల వలన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతాయన్నారు.