ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో గురువారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయంలో స్వామిఅమ్మవారికు అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కైంకర్యాలను శాస్తోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామివారిని విశేషాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయంలో యధావిధిగా అర్జిత సేవలు కొనసాగిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa