కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ పరిధిలోని రాళ్ళపాడు జలాశయం దక్షిణ వైపు ఉన్న కాలువలో గురువారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. అటుగా వెళుతున్న పశువుల కాపర్లు వీటిపై మృతదేహం తేలిఉండటంతో గ్రామంలోని విఆర్ఎ ద్వారా కొండాపురం పోలీసులకు సమాచారం అందజేశారు. కాలువలో మృతదేహం ఉందన్న సమాచారంతో కాలువ వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.