అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో గురువారం జరిగిన భూ వివాదంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా, మరో 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేసారు. మృతుడు అలీ అక్బర్‌గా గుర్తించారు, అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలు మరియు స్థానిక రైతు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంటోలి ప్రాంతంలోని కిస్మత్ కథామి గ్రామంలోని ఓ భూమి విషయంలో జరిగిన వివాదం చివరకు హింసాత్మకంగా మారింది. ఇరువర్గాలు ఇనుప రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు అని పోలీసులు తెలిపారు.