మనలో చాలా మంది మునక్కాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని సాంబారులో కచ్చితంగా వేస్తూ ఉంటారు. అయితే మునగ కాయలే కాదు, వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. మునగాకులో నారింజ పండులో కంటే ఎక్కువ విటమిన్-సి, గ్లాసు పాలలో కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటాయి. అంతేకాకుండా అరటిపండులో కంటే ఎక్కువ పొటాషియం, పాలకూరలో కంటే ఎక్కువ ఐరన్ ఉంటాయి. అందువల్ల మునగాకుతో ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మునగలో ఉండే జింక్, బీటా కెరోటీన్, విటమిన్-ఇ మొదలైనవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
- మునగాకు మెదడు ఎదుగుదలకు, మానసిక సమస్యలను దూరం చేసేందుకు తోడ్పడుతుంది.
- క్యాన్సర్ నివారణలోనూ మునగాకు ఉపయోగపడుతుంది.
- కొన్నిరకాల కాలేయ వ్యాధుల చికిత్సకు మునగ ఉపయోగపడుతుంది.
- మునగాకుతో పప్పు, తాలింపు చేసుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసుకుని అన్నంలోనూ కలుపుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, మునగాకు అనారోగ్యాల సుడి గుండం నుంచి మనల్ని ఒడ్డున పడేస్తుంది.