మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్పై భౌతిక దాడి జరిగినట్లు ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఇటీవల మంత్రి ముఖంపై రక్తంతో కూడిన గాయాలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆరోగ్యం బాగోకపోవడంతోనే ఆసుపత్రికి తీసుకెళ్లామని, దాడి చేయలేదని ఈడీ పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు బీజేపీ, ఈడీపై విమర్శలు గుప్పించారు.