ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీవీ చానెళ్ల డిబేట్లలో ముస్లిం పెద్దలు ఎవరూ పాల్గొనవద్దని సూచించారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ముస్లింలను ఆగ్రహానికి గురిచేశాయి. ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు యూపీలోని పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది.