ముంబైలోని బాంద్రా-వర్లీ సీలింక్ రోడ్డులో కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కారులో వెళ్తున్న ఇద్దరు రోడ్డుపై పడిపోయి విలవిల్లాడుతున్న పక్షిని కాపాడేందుకు కారు దిగి రోడ్డుపైకి వెళ్లారు. ఈ సమయంలోనే వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు వైరల్ గా మారాయి.