ఏపీ సీఎం జగన్ శుక్రవారం రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్ష చేపట్టారు. ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారు. ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను, టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని ఆదేశించారు.