కర్ణాటకలోని దావణగెరె జిల్లా బన్నికోడు గ్రామంలో కెంచప్ప అనే వ్యక్తి తన భార్య షీలాను కొడవలితో నరికి చంపాడు. కూతురి పుట్టిన రోజున చికెన్ కర్రీ వండమని కెంచప్ప తన భార్య షీలాకు చెప్పాడు. కానీ షీలా చికెన్ కర్రీ వండలేదు. అయితే మద్యం మత్తులో ఉన్న భర్త భార్యతో గొడవకు దిగాడు. కొడవలితో ఆమెను నరికి చంపాడు. శుక్రవారం నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.