లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలోని గడ్డ గుండ్లరాచపల్లిలో ఉన్న శ్రీజ పాల ఉత్పత్తుల కేంద్రం రైతుల పాలిట వరంగా ఉందని హెడ్ ప్రొక్యూర్మెంట్ తిమ్మప్ప తెలిపారు. ఈ పాలకేంద్రంలో పాలు పోస్తున్న రైతుల కుదఆదాపు189 మందికి రూ. 3, 72, 818 ఈ ఆర్థిక సంవత్సరం 2021-22కు గాను బోనస్ రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులు వేసిన పాలను బట్టి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నుంచి రూ. 13 వేలు ఈ బోనస్ ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బోనస్లు 2004 నుంచి శ్రీజ సంస్థ పాలు పోసే రైతులకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa