పోలీసులు బాల్య వివాహంని అడ్డుకున్న ఘటన శనివారం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉయ్యురు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికకు వివాహం చేస్తున్నారని సమాచారం అందడంతో ఉయ్యూరు రూరల్ ఎస్సై రమేష్ సంబంధిత బాలిక తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిసి వారికి అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని ఆపు చేయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.