ఏపీలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలని సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.