ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాల ప్రధాన నగరాలకు ఆదివారం రాత్రికి 9ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. సోమవారం పనిదినం కావడంతో సొంతూళ్ళ నుంచి తిరుగుప్రయాణార్థం ప్రయాణికుల రద్దీ ఉంటుందని అధికారులు ముందుగానే ఊహించారు. రద్దీకి అనుగుణంగా బెంగళూరుకు ఏసీ (ఇంద్ర), రెండు సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్ కు నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించారు.