ఉక్రెయిన్ నగరాల్లో కలరా వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. రష్యా దాడిలో అనేక మంది ఉక్రెయన్లు చనిపోయారు. వారి మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటిని తొలగించి అంత్యక్రియలు నిర్వహించడం లేదు. దీంతో శవాల నుంచి దుర్వాసన వచ్చి బ్యాక్టిరియా పేరుకుపోతుంది. ఫలితంగా కలరా వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ఉక్రెయిన్ వాసులతో పాటు రష్యా సైనికులు ఆందోళన చెందుతున్నారు.