విజయనగరం: జియ్యమ్మవలస మండలం జోగులుడుమ్మ గ్రామంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆమె వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ మరిసర్ల బాపూజీ నాయుడు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.