అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం ,రెవెన్యూ అధికారులు నిద్ర అవస్థలో ఉండడంతో అర్ధరాత్రి అక్రమార్కులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చీకట్లో చెరువు మట్టిని తరలించి దోపిడి దారులు లక్షలు దోచుకుంటున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం సమీపంలోని గోవిందవారిపల్లి పెద్దచెరువు నుండి, తిరుపతి సమీపంలోని చెర్లోపల్లి ఇటుక బట్టి నిర్వహించే వారికి ఒక టిప్పర్ మట్టి రూ. 10 వేల రూపాయల చొప్పున అమ్ముతున్నారు. సంబంధిత రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకి మామూలు ఇస్తున్నట్టు చెవులు కొరుకుంటున్నారు.