చిత్తూరు: తవణంపల్లి మండలం, ముత్తరపల్లి గ్రామంలో నివసించే సురేష్ ఒక మహిళతో సహజీవనం చేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. దింతో విసుగు చెందిన ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెను సురేష్ ఎంత వేడుకున్న తిరిగి కాపురానికి రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది శనివారం మధ్యాహ్న సమయంలో కె. పట్నం గ్రామం సమీపంలో, తిరుపతి – బెంగళూరు హైవే రోడ్డుకు ప్రక్కన, మామిడితోపులో మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ అన్న కుమారుడు సుమన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.