పెద్దాపురం పట్టణంలో సుధాకలనీలో గత వారం అత్తపగలే జరిగిన దొంగతనం నకు సంభందించి ఇద్దరు దొంగలు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 5. 50 లక్షల నగదు మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం ఇంచార్జి డీఎస్పీ బీ అప్పారావు, సీఐ అబ్దుల్ నబీ లు తెలిపారు. ఈ మేరకు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో డీఎస్పీ మాట్లాడుతూ సుధా కాలనీలో నివాసం ఉంటున్న చుక్కన దుర్గరాజు ఈ నెల 7న తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడాన్ని గుర్తించి పెద్దాపురం పోలీసులకు దుర్గారాజు పిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఆర్బీ కొత్తూరు వద్ద డీఎస్పీ అప్పారావు ఆధ్వర్యంలో వాహనాలు తనికీ చేస్తుండగా అనుమానాస్పదoగా ఉన్మ ఇద్దరు వ్యక్తులను పోలీసులు నిలుపుదల చేసి ఆరాతీయగా సుధాకాలనీలో చోరీ నేరం తామే చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ. 5. 50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ కూడా స్వాధీనం. చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో రాజమండ్రీకి చెందిన ఉప్పులూరి శివ భాస్కర రాజ్, గొర్రెల చినబాబు లు ఉండగా మూడవ వ్యక్తిటేకుమూడి దుర్గాప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సంఘటన రూ. 6 లక్షలు చోరీ జరిగినట్లు చెప్పారు. వారివద్ద నుంచి 5. 19 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈచోరీ సంఘటనలో పెద్దాపురం సబ్ డివిజన్ కు చెంది పోలీసు అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని డీఎస్పీ అప్పారావు తెలిపారు. ఈ సమావేశం. లో సీఐ అబ్దుల్ నబీ, పెద్దాపురం ఎస్ ఐ మురళీమోహన్ తదితర సిబ్బoది పాల్గొన్నారు.