కనేకల్లు మండల కేంద్రంలోని దిగువగేరిలో వుండే వెంకటప్రసాద్ (48) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని తన తోటకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శనివారం సాయంత్రం గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.