పట్టణ శివారులో కేతిరెడ్డి కాలనీ, ఎల్ 1,2,3,4 కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవని ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం, సీఐటీయూ నాయకులు శనివారం ఆయా కాలనిలో ఇంటింటా సీపీఎం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనిలో రహదారులు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేసారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనపై ముద్రించిన కరపత్రాలను పంపిణి చేసారు. కార్యక్రమంలో సీపీఎం సీఐటీయూ నాయకులూ పెద్దన్న రమణ తదితరులు పాల్గొన్నారు.