పెదగంట్యాడ నడుపూరు హైస్కూల్ ప్రాంగణంలో భారత్ భాక్సింగ్ క్లబ్ కోచ్ మాజీ సైనికుడు మురళీ , వెంకట్రెడ్డి ఆద్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా బీజేపి గాజువాక నియోజక కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. పెదగంట్యాడ మండల అధ్యక్షులు కిలాని ముసలయ్య సౌజన్యంతో క్రీడాకారులకు పౌష్టికాహారం గుడ్లు పాలు బిస్కెట్లను అతిదుల చేతులనీదుగా పంపిణీ చేసారు. నరసింగరావు మాట్లాడుతూ గత నలభై ఐదు రోజులుగా మాజీ సైనికులు సీనియర్ కోచ్ మురళీ వెంకట్ రెడ్డి గంధం సాయి మాస్టర్లు 150 మంది బాక్సర్లకు ప్రతి రోజు రెండు గంటల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారని వీరిలో ఇద్దరు కేలో ఇండియాకి సెలెక్టు అవడం సంతోషకరమైన విషయమని , విద్యార్థిని విద్యార్థులు ప్రతి రోజు చదువుతో పాటు క్రీడల నేర్చుకోవడం వలన ఆత్మ రక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు శరీర దారుడ్యం ఆరోగ్యం సాధించడం సాద్యమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు టేకేటి పెంటయ్య ఎరుకునాయుడు వరలక్ష్మీ జిలకర్ర భువనేశ్వరి బొండా యల్లాజీరావు పేర్ల అప్పారావు గురప్ప తదితరులు పాల్గొన్నారు.