పలమనేరు మున్సిపాలిటీలోని గడ్డూరు కాలనీకి చెందిన కోమల తన భర్త గణపతి అకారణంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనపై నిత్యం దౌర్జన్యం చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే పట్టణానికి చెందిన జీవిత తన భర్త రోజు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పలమనేరు ఎస్ఐ నాగరాజు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.