భారత వెబ్ సైట్లపై సైబర్ దాడి జరిగింది. దేశవ్యాప్తంగా పోర్టల్స్ తో సహా 70 వెబ్ సైట్ లపై సైబర్ దాడి జరిగింది. డ్రాగన్ ఫోర్స్ మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరిట హ్యాక్ చేశారు. హైదరాబాద్ కి చెందిన అగ్రిటెక్ కంపెనీలపై సైబర్ దాడి జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.