బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఆదివారం సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న నేహా(27) ను దుండగులు కాల్చి చంపారు. అయితే నేహా కుటుంబ సభ్యులు ఆమె భర్త ఇషాంక్ భరద్వాజ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2016లో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇషాంక్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. నేహాను చంపుతానని ఇషాంక్ కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని నేహా తల్లి ఆరోపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.