కావలసిన పదార్ధాలు: బెల్లం - అరకప్, పుదీనా - గుప్పెడు ఆకులు , నిమ్మకాయ - 1, బ్లాక్ సాల్ట్ - అరస్పూన్, మిరియాల పొడి - అరస్పూన్, జీలకర్ర పొడి - అరస్పూన్, సాల్ట్ - కొద్దిగా, అల్లం పొడి - 1 స్పూన్, ఐస్ క్యూబ్స్ - కొన్ని.
తయారీవిధానం:
-- ఒక గిన్నెలో నీళ్లు పోసి, అరగంటపాటు బెల్లాన్ని నానబెట్టాలి. పుదీనా ఆకులను శుభ్రంగా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
-- ఇప్పుడొక మిక్సీ జార్ ను తీసుకుని అందులో నానబెట్టిన బెల్లాన్ని (నీటితో సహా) వేసి, పుదీనా ఆకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-- కావలసి వస్తే కొన్ని నీళ్లను కూడా మిక్సీ పెట్టేటప్పుడు కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టిన మిశ్రమాన్ని ఎటువంటి ఆకులూ, కాడలు రాకుండా వడ కట్టుకోవాలి.
-- వడకట్టుకున్న బెల్లం, పుదీనా రసం లో బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, అల్లం పొడి (బయట మార్కెట్లో దొరుకుతుంది), జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
-- నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా ఈ జ్యూస్ లో కలుపుకోండి. ఈ క్రమంలో మనం సాధారణంగా వాడే ఉప్పును కూడా చిటికెడు వెయ్యండి.
-- ఈ జ్యూస్ ను సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగండి.