ఆవాలు ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.
-- పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి, ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
-- శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడితో చెక్ పెట్టవచ్చు. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.
-- వంటల్లో వాడడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా సాగుతుంది.
-- కొబ్బరి నూనెలో ఆవనూనెను కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుంది.
-- కడుపులో మంట, చర్మ సంబంధమైన సమస్యలు ఉన్న వారు వీటిని తాళింపులో వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా వేడి శరీరం ఉన్న వారు వీటిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa