ఎమ్మెల్సీ అనంతబాబు బాబుకు మరోసారి నిరాశ ఎదురైంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇదివరకే అనంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరగగా. సోమవారం నాటి విచారణలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి... అనంతబాబు, పోలీసుల వాదనలను విన్నారు. ఈ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని ఈ నెల 15న వెల్లడిస్తానని చెప్పిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa