దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు సిఎం జగన్ రెడ్డి అని తెలుగుదేశం నేత నారా లోకేశ్ విమర్శించారు. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది అని తెలిపారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో దళితయువకుడ్ని అతి కిరాతకంగా చంపిన అనంతబాబుని హీరోగా కీర్తిస్తూ వైసీపీ ఊరేగింపు నిర్వహించడం చూశాక, ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకు శిక్షేనని మరోసారి రుజువైంది అని లోకేష్ తెలిపారు. దళితుల్ని దారుణంగా చంపే వాళ్లకి ప్రమోషన్లే తప్ప సస్పెన్షన్లు ఉండవని జగన్రెడ్డి వైసీపీ లీడర్ల నుంచి కేడర్ వరకూ భరోసా ఇస్తున్నారు అని లోకేష్ అన్నారు.