గుంటూరు జిల్లాలో మంగళవారం నాలుగు కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నగరపాలక సంస్థ, పెద్దకాకాని, తాడేపల్లి, మంగళగిరి రూరల్ మండల పరిధిలో ఒక్కొక్క కేసును గుర్తించారు. కొవిడ్ కేసులు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నoదున్న ఆ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.