ఏపీఎస్ఆర్టీసీ కి ఆదివారం రోజున రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుమల-తిరుపతి మధ్య ఎక్కువ బస్సులు నడిపినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలోనే రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు పెంచి, ఏపీ బస్సుల్లో ఛార్జీలు పెంచనందున ఆదాయం పెరిగిందన్నారు.