ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇకపై హైసెక్యూరిటీ ప్లేట్లు లేని వాహనాలకు రూ.1000 జరిమానా విధించాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. 3 నెలల వరకు వాహనదారులందరికీ మెసేజ్‌లు పంపనున్నారు. 3 నెలల్లో వీటిని బిగించుకోకపోతే, ఆ తర్వాత రూ.1000 చొప్పున జరిమానా విధిస్తారు.