బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గ పరిధిలో మంగళవారం రాత్రి నుండి ఉరుములతో కూడిన ఈదురుగాలులు, మేఘాలు దట్టంగా పట్టి చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుండి ఆకాశం మేఘవంతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎండవేడిమితో ఉక్క పోతకు గురైన ప్రజలు రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ప్రజలు సేదతీరుతున్నారు.