రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన యువతి(23)పై ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి సోమవారం అత్యాచారం చేశాడు. యువతిని వదిలి ఆమె సోదరుడు బయటకెళ్లాడు. ఆ సమయంలో అదును చూసి నిందితుడు అఘాయిత్యం చేశాడు. మత్తుమందులిచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa